గతంలో ఐటమ్స్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉండేవారు. కానీ, ఇప్పుడు ఐటమ్స్ సాంగ్స్ లో హీరోయిన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా బాహుబలిలో ఉన్నట్లుగానే ఓ మాస్ ఐటమ్ సాంగ్ ఉందట!. అయితే ఇప్పటికే సంగీత దర్శకుడు కీరవాణి ఓ పాట కూడా సిద్ధం చేశారట. అయితే ఇందులో స్టెప్పులేయడానికి టాలీవుడ్ ఫిట్ నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తున్నారట చిత్రయూనిట్. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కంబినేషన్ కాబట్టి రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఆ పాట ఎలా ఉండబోతుంది అనేది.