ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందనే ప్రచారం మొదలైంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. దీన్ని మూడో దశగా భావించవచ్చని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపిన కేజ్రీవాల్.. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తోందన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం మంగళవారం మొత్తం 59,540 మందికి కరోనా టెస్టులు చేయగా, వారిలో 6,725 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గడం, చలి పెరగడం, పండుగల వాతావరణం ఇవన్నీ కరోనా కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.