'కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఇక ఈ చిన్నది బాలీవుడ్ లో చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో తెలుగు సినిమాలే చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రకుల్ కు క్రేజీ ఆఫర్ వచ్చింది. ఏకంగా బిగ్ బీ అమితాబ్ సినిమాలో అమ్మడికి నటించే ఛాన్స్ దక్కింది. అమితాబ్ , అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో మేడే అనే సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ పైలెట్ గా కనిపించనుంది. ఈ సినిమా తో అమితాబ్ తో నటించాలన్న తన కల నిజమైందని సంబరపడుతుంది రకుల్ . ఈ సినిమా 2021 లో రిలీజ్ చేయాలనీ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా తో పాటు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ అలాగే నితిన్ నటిస్తున్న చెక్ సినిమాలో నటిస్తుంది రకుల్ .