ముంబై: టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 21, 2020న అతడి నివాసంలో మృతదేహ లభ్యమైంది. దీనిని మొదట స్థానిక పోలీసులు ఆత్మహత్యగా పరిగణించి ఆత్మహత్య కేసును నమోదు చేసుకున్నారు. తరువాత అతడి కుటుంబ సభ్యులు బీహార్ పోలీస్ స్టేషన్టో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ను వారు నమోదు చేశారు. ఈ కేసును ఇండియన్ పీనల్ కోడ్ 302. 34 సెక్షన్లలో నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను సంఘటన చోటుచేసుకున్న అంబోలీకి పంపారు. దాంతో అంబోలీ పోలీసులు ఈ కేసును అనేక కోణాల్లో విచారిస్తున్నారు. అక్షత్ కుటుంబ సభ్యులు అతడి గర్ల్‌ఫ్రెండ్ ఇంకా ఆమె సోదరిపై కేసును ఫిర్యాదు చేశారు. కేసులో అనుమానం ఉన్నవారు ఎవ్వరినైనా కచ్చితంగా ప్రశ్నిస్తామనీ, వెనుకంజ వేసేదే లేదని పోలీసుల తెలిపారు.