చెన్నై: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో తమిళనాడుకు చేరనున్న అల్పపీడన గాలులు. తమిళనాడు ప్రభుత్వాన్ని భారత మీటియోరోలోజికల్ డిపార్టిమెంట్ తుఫాను గురించి ముందుగానే హెచ్చరించింది. బంగాళాఖాతంలో భారీ ఎత్తున అల్పపీడనం ఏర్పడిందని దీని కారణంగా దేవంలో భారీ నుంచి అతి భారీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే తుఫాను నవంబరు 25 నాటికి కరైకల్, మల్లాపూరాలను దాటుతుందని ఐఎండీ తెలిపింది. అయితే మరో 12 గంటల్లో అల్పపీడనం మరింత బల పడుతుందని, 24 గంటల్లో తమిళనాడు-పుదుచ్చేదీ రేవుకు అల్పపీడన గాలులు వస్తాయని, దీంతో తమిళనాడులో తుఫాను పడుతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం అరేబియా సముధ్రంలో వాయువ్యంలో 10.4 ఎన్ లాటిట్యూడ్తో, పడమరకు 51.5 ఈ లాటిట్యూడ్తో ఉందని తెలిపారు. అంతేకాకుండా సమాలియా రెవుకు తూర్పుగా 40 కిలోమీటర్ల దూరంలో, వాయువ్యానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు.