జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్న విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రెండు నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మజ్లీస్ చెబుతోందని, అది వినడానికి ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. కేవలం ఓట్ల కోసమే మజ్లిస్‌తో పొత్తు పెట్టుకొని ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2016 మేనిఫెస్టోలోని అంశాలనే 2020లో తెరాస చేర్చిందని ఆమె తెలిపారు. 2016 మేనిఫెస్టోలో పేర్కొన్న ఎన్ని హామీలను నెరవేర్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరి హైద్రాబాద్ కావాలని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే బీజేపీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. హైటెక్ మాటలతో హైటెక్ షో కేస్ ల తయారు అయ్యాడు కేటీఆర్.. 10 వేలు పంచాకే ఎన్నికలు పెట్టేది ఉంటివి.. ఎందుకు ఎన్నికలు పెట్టావు.. ఇచ్చేందుకు డబ్బులు లేవు కాబట్టే ఇలా చేశారు. అయ్యా.. కొడుకు అంతర్జాతీయ దొంగల్లా మారారు అంటూ డీకే అరుణ ఫైర్ అయ్యారు.