సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం ఓ కొత్త సర్వేను నిర్వహించేందుకు సిద్ద మవుతోంది. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను గుర్తించేందుకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సర్వే నవంబరు 25 నుంచి డిసెంబరు 27 వరకు కొనసాగనుంది. ఇందులో ఇద్దరు ఒక జట్టుగా మొత్తం 800 జట్టులు పాల్గొననున్నాయి. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో ఎందరు కరోనా, ట్యూబర్కులోసిస్, లెప్రసీ, సుగర్, బీపీ వంటి రోగాలతో బాధింపబడుతున్నారనే దానిపై ప్రభుత్వానికి ఓ క్లారిటీ వస్తుందని, ప్రజల ఆరోగ్య రీత్యా వారకి కావలసిన సదుపాయాలను ఏర్పరిచేందుకు వీలవుతుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా కలకలం రేపుతుండటంతో ఈ ప్రణాళికను తీసుకొచ్చామని వారు తెలిపారు. అంతేకాకుండా ఎవ్వరికైనా కరోనా వస్తే వారకి మునపటి నుంచి ఉన్న రోగాలపై ఓ అవగాహన కోసం కూడా ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో కరానాను నియంత్రించేందుకే ఈ సర్వేను మొదలు చేయనున్నామని దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సర్వే ఇంటి ఇంటికీ వచ్చి చేస్తారని తెలిపారు.