హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజునిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ఆరేండ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణం ఉంది. తెలంగాణ లో పక్కా లోకల్ పార్టీ టీఆర్ఎస్. గల్లీ పార్టీ కావాలా...ఢిల్లీ పార్టీ కావాలా ఆలోచన చేయండి, రెండు జాతీయ పార్టీల నేతలు ఓట్ల కోసం వస్తే ఏం చేశారో అడగండి. కిషన్ రెడ్డి ని హైదరాబాద్ కోసం కేంద్రం అర పైసా పనిచేసిందా అని అడగండి. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏం లేదు.తెలంగాణ పైసలతో ఢిల్లీలో కులుకుతున్నారు. మేము చెబుతున్న లెక్క తప్పు అయితే ఏ శిక్షకు అయిన సిద్ధం. డిసెంబర్ 4 తర్వాత వరద బాధితులకు సాయం అందిస్తాం అని కేటీఆర్ తెలిపాడు. కేంద్రంకు వరద సాయం కోసం కేసీఆర్ లేఖ రాసి 8 వారాలు అయ్యింది.ఉలుకు లేదు ...పలుకు లేదు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. కర్ణాటక, గుజరాత్ కు కేంద్రం నిధులు ఇచ్చింది. మతం పేరుతో హైదరాబాద్ లో చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి కావాలా...అరాచకం కావాలా ప్రజలు ఆలోచించాలి అని పేర్కొన్నారు.