మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం క్రాక్. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న `క్రాక్` సినిమా సంక్రాంతి 2021 రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం రవితేజ నటించిన క్రాక్ సినిమాకు లీగల్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ అయోమయంలో పడిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన తమిళ డిస్ట్రిబ్యూషన్ కోర్టుకు వెళ్లడంతో లీగల్ చిక్కుల్లో పడింది ప్రస్తుతం క్రాక్ సినిమా. సినిమా రిలీజ్ ఆపేందుకు కోర్టు స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. విశాల్ హీరోగా తమిళంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ ఆఫీస్ వద్ద బోల్తా పడింది ఈ సినిమా. అయితే తమిళ సినిమా నిర్మాత ఠాగూర్ మధు పై ప్రస్తుతం తమిళ డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకెక్కడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్రాక్ విడుదలకు ప్రస్తుతం అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.