పవర్ స్టార్ అంటే అందరికీ పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఇది కేవలం తెలుగులోనే కాదు, ప్రపంచమంతా పవర్ స్టార్ అంటే పవన్ కళ్యణ్ అనే నమ్ముతుంది. కానీ ఒకేఒక్క రాష్ట్రంలో పవర్ స్టార్ అంటే పవన్ కాకుండా వేరే హీరో గుర్తుకొస్తారు. అది ఎక్కడో కాదు కన్నడలో. ప్రపంచానికి పవర్ స్టార్ అంటే పవన్ అయినా కన్నడకు మాత్రం పవర్ స్టార్ అంటే పునీత్ రాజ్‌కుమార్. కన్నడ సినిమాల్లో తన బాల్యం నుంచే నటిస్తూ ఉత్తమ బాల్య నటుడిగా జాతీయ స్థాయి అవార్డును సొంతం చసుకున్నాడు. కన్నడలో భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న పునీత్‌ను అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం తెలుగు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అప్పు సినిమాతో కన్నడ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తన నటనతో పవర్ స్టార్ అయిపోయాడు. అయితే కన్నడ హీరోలకు తెలుగులో అంత మార్కెట్ లేదు. ఉపెంద్రకు ఏదో కాస్త మార్కెట్ ఉందేది. అయితే కేజీఎఫ్ వచ్చి ఈ లెక్కలను తారుమారు చేసింది. దాంతో కన్నడ హీరోలు మళ్లీ తెలుగు చిత్ర సీమలో తమ కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా పునీత్ తన కొత్త సినిమా యువరత్నతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. అయితే తెలుగు ప్రేక్షకులు పునీత్‌ను ఆదరిస్తారా లేదా అని చూడాలి.