రవితేజ నేలటిక్కెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మాలవికా శర్మ. తన తొలి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్‌ను సంపాధించింది. ప్రస్తుతం రామ్ హీరోగా రానున్న రెడ్ సినిమాలోనూ హీరోయిన్గా చేస్తోంది. దాని తరువాత మరో రెండు సినిమాలు ఈ అమ్మడు కోసం క్యూలో ఉన్నాయి. అయితే ఇటీవల ఈ పుత్తడి బోమ్మ సోషల్ మీడియా ద్వారా తన ఫాన్స్‌కు దిమ్మతిరిగిపోయే విషాన్ని తెలిపింది. తాన మానసిక రోగినంటూ ఆమె పెట్టిన పోస్ట్‌కు అభిమానులకు ఏమని అనాలో అర్థం కాలేదు. ఈ అమ్మడు క్లెప్లామేనియాక్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాని చెప్పింది. ఈ సమస్య ఉన్నవారు అరుదు. దాదాపుగా ప్రతి ఒక్కరిలోనూ ఇది ఉన్నా అది సమస్యగా అనిపించదు. కానీ చాలా అరుదుగా ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఈ రోగం ఉన్నవారికి తమ ఎదురు ఉన్న చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలని అనిపిస్తుంటుంది. అయితే ఈ అమ్మడు పక్కన ఒకరు ఉంటూ ఎప్పటికప్పుడు తన ఆలోచనలనకు పక్కదారి పట్టిస్తూ తన మానసిన పరిస్థితి గురించి గుర్తు చేస్తుంటారని ఈమె చెప్పుకొచ్చింది.