రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేయనున్నాడు. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా సలార్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సంర్భంగా వచ్చే ఏడాది జనవరీలో సలార సినిమా షూటింగ్ మొదలు కానుందని అన్నాడు. దాంతో అభిమానులకు ఏమీ అర్థం కాలేదు. జనవరీలో ఆదిపురుష్ షూటింగ్ మొదలుకానుందని ఇటీవల ప్రభాస్ తెలిపాడు. ఇప్పుడు మళ్లీ సలార్ షూటింగ్ అంటే రెండు సినిమాలు ఒకేసారి చిత్రీకరణ చేస్తాడా. అని అందరూ తలలు పట్టుకున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ తన రాదే శ్యామ్ సినిమా షూటింగ్‌ను ఈ నెలలోనే పూర్తి చేయాల్సి ఉంది. మరి రెబల్ స్టార్ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడనేది చూడాలి.