యార్కర్ కింగ్ బుమ్రా ఈ పేరు అందరికి సుపరిచితమే 2016 జనవరీ 23న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో మెరిసిన యువకిరణం. వచ్చిన అతి తక్కువ సమయంలోనే జట్టులో తన కంటూ ప్రత్యే స్థానాన్ని సంపాదించుకున్నాడు. అదే ఏడాది జనవరీ 26న ఆస్ట్రేలియాతో తన టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. దాంతో తనదైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఎప్పటి కప్పుడు అందరికి ఆశ్చర్యపరుస్తూ వచ్చాడు. రెండు సంత్సరాల తరువాత 2016 జనవరీ 5న సౌత్ ఆఫ్రికాపై టెస్ట్ పోరులో భారత్ తరుపున పోరాడాడు. ఎప్పటికప్పుడు తనను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అయితే బుమ్రా ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటన్నాడు. దాంతో ఎందరో ప్రముఖులు అతడిని విష్ చేశారు. అతడికి బీసీసీఐ కూడా పుట్టినరోజున విష్ చేసింది. బుమ్రా భారత జట్టు తరపున చివరిగి 2020 ఫిబ్రవరీ 11న న్యూజిల్యాండ్పై ఆడిన వన్డేలో కనిపించాడు. ఆ తరువాత ఆసీస్ టూర్కు అతడు ఎంపిక అవ్వలేదు. మరి ఈ సమయంలో శిక్షణ తీసుకొని అందరిని మళ్లీ ఆశ్చర్యానికి గురిచేస్తాడేమో చూడాలి.