జాతీయ స్థాయి దర్శకుడు ప్రశాంత్ నీల్ అందరికీ తెలుసిన పేరే. ప్రస్తుతం ప్రశాంత్ తన తరువాతి సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సలార్ అనే పేరును ఖరారు చేశారు. దీనికి సంబందించిన పోస్టర్‌ను కూడా ఈ నెల రెండున విడుదల చేశారు. అయితే ప్రభాస్‌తో సినిమా పూర్తయ్యాక కూడా ప్రశాంత్ తన చిత్రాన్ని మరో తెలుగు హీరోతో చేయనున్నాడని సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడని చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా దాదాపు 2022నాటికి పట్టాలెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ తరువాత రామ్ చరణ్‌తో మరో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.