నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల జోరు భారీగా ఉంది. థియేటర్లకు గట్టి పోటీ ఇస్తున్న ఓటీటీ సంస్తలు సినిమాలతో పాటు వెబ్ సిరీలకు కూడా ప్రధాన్యత నిస్తున్నాయి. కథ బాగుందనిపిస్తే దాన్ని తెరకెక్కిస్తున్నాయి. అయితే తెలుగు దర్శకులు ఎందుకు అలాంటి మంచి కథలు తీయట్లేదు, వారికి అవి ఎందుకు నచ్చట్లేదని ఇటీవల కొందరు ప్రశ్నించారు. దాంతో ఈ ప్రశ్నలకు చెక్ పెట్టేందుకు దగ్గుపాటి రానా రంగంలోకి దిగాడు. ఓటీటీలోనూ తమ ప్రత్యేకత ఉండాలని సురేష్ ప్రొడక్షన్ హౌస్ రెక్కలను ఓటీటీలపై కూడా చాపనున్నాడు. దగ్గుపాటి ఫలింస్ పేరుతో మరో ప్రొడక్షన్ హౌస్‌ను మొదలు పెట్టనున్నాడు. దీని ద్వారా కొత్త తరహా కథలను సిద్దం చేసి మొదట నెట్‌ఫ్లిక్స్‌లో ఆ తరువాత అమెజాన్‌లలో విడుదల చేయనున్నారు. అయితే కొన్ని టీమ్‌లు ఏర్పాటు చేసి వారిని కాంసెప్ట్లను పరీక్షించి వాటినుంచి మంచి వాటిని ఎన్నుకుంటారు. కానీ ఈ కాంసెప్టులు కేవలం తెలుగులో ఉంటాయని, అవి విజయం సాధిస్తే వాటిని ఇతర భాషల్లోకి మారుస్తారని సమాచారం. ఇప్పటికే రానా కొన్ని టీమ్‌లను ఏర్పాటు చేసి వారి ఆలోచనలను, కాంసెప్ట్లను చూస్తున్నారు. అదేవిధంగా సురేష్ ప్రొడక్షన్స్ వారు కూడా నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. మరి ప్రొడక్షన్లోకి రానా వచ్చాక ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.