మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మెగా హీరో వైష్ణవ్ తేజ్ చూస్తున్నాడు. అందులో భాగంగా వైష్ణవ్ ఉప్పెన సినిమాను చేశాడు. కానీ ఈ ఇప్పటి వరకు విడుదల కాలేదు. అంతేకాకుండా ఈ సినిమా విడుదలపై క్లారిటీ లేదు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకొని మెగా హీరోను పరిచయం చేసేందుకు సర్వసన్నద్దంగా ఉంది. కానీ సినిమా విడుదల మాత్రం వరుస వాయిదాలు పడుతోంది. నిజానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత థియేటర్ల తెరుచుకున్నాక థియేటర్లలో ఈ సినిమా బొమ్మ పడుద్దని అనుకున్నారు. అది కూడా జరగలేదు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే రెవెన్యూ పరంగా కూడా బాగుండేది. కానీ చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరీలో విడుదల చేయానుకుంటున్నారట. అయితే ఈ సినిమా పండగకు వచ్చుంటే పెట్టిన బడ్జెట్ వసూలు కావడం కాస్త సులభతరం అయ్యేది. కానీ ఫిబ్రవరీ అంటే ఏమాత్రం రికవరీ చేస్తుందనేది వేచి చూడాలి. ఈ సినిమాకు విజయ్ సేతుపతి కీలక పాత్ర అట్రాక్షన్‌గా నిలువనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల గురించి ఇప్పటికే పలుమార్లు ప్రకటించి తరువాత కుదరక చిత్రబృందం వెనుదిరిగింది. మరి ఈ సారైనా అనుకున్న విధంగా జరిగితే ఫిబ్రవరీలో ప్రేక్షకులను అలరించేందుకు ఈసినిమా థియేటర్లలోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆడుతుందో లేదో వేచి చూడాలి.