విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. నేడు సాయంత్రం అనుష్క శర్మా పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ విషయం విన్న అభిమానులు తమ ఆనందాన్ని ట్వీటల రూపంలో చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని ట్వీటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ సాయంత్రం మాకు పాప పుట్టింది. అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేటి నుంచి మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కానుంద’ని విరాట్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఇటీవల లాక్డౌన్ సమయంలో బేబీ బంప్‌తో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క అభిమానులకు తెలిపింది. నేడు సాయంత్రం పాపకు జన్మనిచ్చింది.