టాలీవుడ్లో హీరోలకే కాకుండా గాయకులకు కూడా అభిమానులు ఉంటారు. అలానే అత్యంత విపరీతపైన ఫాన్ ఫాలోయింగ్ ఉన్న గాయని సునీత. టాలీవుడ్లో అద్భుత పాటలకు తన స్వరాన్ని అందించి, వాటికి ప్రాణం పోసిన గాయని సునీత. తనదైన విధానంలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్లో అగ్ర గాయనిగా దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే సునీత ఎన్నడో తన భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల డిజిటల్ కంపెనీ సీఈఓ రామ్ వీరపనేనితో రెండో వివాహానికి సిద్దమయింది. సునీత రెండురోజుల క్రితం అంగరంగ వైభంగా తన రెండో వివాహాన్ని జరుపుకుంది. ఈ వివాహానికి ప్రముఖ సినీతారలు హాజరయ్యి సునీతను విష్ చేశారు. ఈ పెళ్లిని వారి పెల్లలు దగ్గరుండి జరిపించారు. అయితే ఇటీవల సునీత రెండో వివాహంపై క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ సునీత కళ్ళలో ఆనందం ఏంటి. ఆ ఆనందాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే. ఎవరీకీ తెలీకుండా చాటుగా చేసుకుంటారు. బయటకు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ సునీత మాత్రం అలా కాకుండా రెండో పెళ్లి చేసుకుంటూ కూడా ఆ ఆనందం ఏంటి? ఇలా చేస్తూ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమాజం నాశనం అయిపోదా?’ అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారుతున్నాయి. వీటిపై సునీత ఎలా రెయాక్ట్ అవుతందని అందరూ వేచి చూస్తున్నారు.