మల్టీస్టారర్ సినిమాలంటేనే ప్రత్యేక అట్రాక్షన్‌గా విడుదలవుతాయి. మల్టీ స్టారర్ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ వారు అనుకున్న విధంగా అన్ని జరగవు. అయితే ఓ మల్టీస్టారర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదేనండీ విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసి ఔరా అనిపించింది. దాంతో లాక్డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి ఎఫ్2కి సీక్వెల్ సిద్దం చేశాడు. దీనిని కూడా సినిమాగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేశాడు. అందరూ ఓకే చెప్పడంతో ఈ సినిమాను ఎఫ్3 పేరుతో ప్రారంభించాడు. ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా భార్యల కారణంగా వచ్చే ఫ్రస్ట్రీషన్ కాకుండా కొత్త తరహీలో డబ్బ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్‌ను చూపించనుంది. అయితే ప్రస్తుతం ఎఫ్3 డిజిటల్ రైట్స్ రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నాయట. కానీ ఈ సినిమా మొదటి భాగం అయిన హిట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డెజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ దీనికి భారీ దరకు కొనుగోనులు చేసిందట. ఈ సినిమా రూపొందనున్న అన్ని భాషల రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తన సొంతం చేసుకుందట. ప్రతి భాషలోని రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. ఈ సినిమా తన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఇందులో ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మెగా హీరో కరుణ్ తేజ్ కూడా పాల్గొన్నాడు.