నేడు దేశవ్యాప్తంగా వ్యాక్సీన్ సప్లై ప్రారంభించింది కేంద్రం. “సీరం” ద్వారా తయారు చేయబడిన “కోవిషీల్డ్ “ వ్యాక్సిన్ సరపరా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 13 ప్రాంతాలకు తోమ్మిది ప్రత్యేక విమానాల ద్వారా వ్యాక్సిన్ ను తరలించింది. 478 ప్రత్యేక బాక్సుల ద్వారా కూడా వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఒక్కోక్క బాక్సు బరువు 32 కేజీలు. ఈ నెల 16 నుంచి “వ్యాక్సినేషన్” ప్రక్రియ ప్రారంభం నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి విడత డోసులు ఎయిర్ ఇండియా, స్పైయిస్ జట్, ఇండిగో విమానాల ద్వారా పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్, హైదరాబాద్, విజయవాడ, గువాహటి, లఖ్‌నవూ, చండీగఢ్, భువనేశ్వర్‌కు సరఫరా చేసింది. ఇందుకోసం మొత్తం 8 ప్రత్యేక వాణిజ్య, 2 కార్గో విమానాలను వినియోగించింది.