ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో కోటి నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండియాలో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,79,179కు చేరింది. ఇందులో 1,01,11,294 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,16,558 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 167 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,51,327 కి చేరింది.