కరోనా లాక్ డౌన్ అనంతరం అందరి చూపు ఎక్కువగా విజయ్ మాస్టర్ సినిమాపైనే ఉంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ 'మాస్టర్' సినిమా పైరసీకి గురి కావడం అందరిని షాకింగ్ కు గురి చేసింది. ఈసారి విజయ్ దాదాపు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనేలా తన సినిమాను రిలీజ్ చేసుకుంటున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేమికులు మాస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక తమిళ తెలుగు భాషల్లో జనవరి 13న విడుదల కాబోతుండగా హిందీలో మాత్రం జనవరి 14న విడుదల అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై పైరసీ దెబ్బ పడటం హాట్ టాపిక్ గా మారింది. భయంతో చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఇక దర్శకుడు ఈ విషయంపై చాలా ఎమోషనల్ అయ్యాడు. 'ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మాస్టర్ సినిమా మీ ముందుకు రావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. దయచేసి లీకైన వీడియోలు మీ వరకు వస్తే షేర్ చేయవద్దు.. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా'నని ట్విట్టర్ ద్వారా తెలిపారు.