టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ అనుష్క దంపతులకు నిన్న పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. అనుష్క, బేబీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయతల వల్లే అనుష్క, తాను జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. తాజాగా కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అప్పుడే పుట్టిన పాప కాళ్ల చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, 'వెల్ కమ్' మెసేజ్ పెట్టాడు. దీనికి 'మా ఇంటికి దేవత వచ్చింది. పట్టరాని సంతోషంగా ఉంది' అని ఆయన క్యాప్షన్ కూడా రాశాడు.