సమంత అక్కినేని టాలీవుడ్‌తో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సమంతా ఓ హిందీ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే ది ఫ్యామిలీ మ్యాన్2. దీని మొదటి భాగం అద్భుత ప్రజాదరణ పొందడంతో దీని రెండవ భాగాన్ని కూడా మేకర్స్ ప్లాన్ చేశాడు. ఈ వెబ్ సిరీస్‌లో విలక్షణ నటుడు మనోజ్బాజ్పెయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఎక్కడున్నావ్.. ఫోల్ లిఫ్ట్ చేయండం లేదు అంటూ ప్రయమణితో టీజర్ ప్రారంభం అవుతోంది. ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఈ టీజర్ ట్రెండ్ అవుతోంది. అభిమానుల్లో ఎంతో ఉత్కంఠను నింపుతున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందులో సమంత నెగిటివ్ పాత్ర చేయనుందట. ఈ వెబ్ సిరీస్ గురించి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ నెల 19న ట్రైలర్ వస్తుందని సమంతా తన ట్విటర్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ టీజర్‌ను అందిరికీ షేర్ చేసింది. ప్రముఖ నటులతో తెరకెక్కుతున్న దిఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ వెబ్‌సిరీస్ అంచనాలను టీజర్‌తో మరింత పెంచేసింది. ప్రస్తుతం ప్రేక్షకులు 19న రానున్న ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక పూర్తి సిరీస్ కోసం వారు పడిగాపులు కాస్తున్నారు. మరి ఈ సిరీస్ వారి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందో లేదో వేచి చూడాలి.