బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దాదాపు 11 మంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు నార్త్ జోన్ పోలీసులు. ఈకేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రమేయం ఉందా.. లేదా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, గోవా, బెంగళూర్, మైసూర్, పునే రాష్ట్రాల్లో కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలించారు. మొత్తం 15 పోలీస్ బృందాలుగా విడిపోయి ఎట్టకేలకు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు నార్త్ జోన్ పోలీసులు. కిడ్నాపర్ల కు సంబందించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఇతర ఐడెంటిటీ అధరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ 11 మంది కిడ్నాపర్ల ను రహస్య ప్రాంతంలో ఉంచారు పోలీసులు.