అక్కినేని హీరో నాగచైతన్య తన కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అందులోభాగంగా మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇటీవల చైతూ శేఖర్ కమ్ములతో తన నూతన చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్గా నాచురల్ బ్యూటీ సాయిపల్లవి చేస్తోంది. దీనికి లవ్‌స్టోరీ అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే విడుదల ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై హోప్స్ బాగా పెరిగాయి. అయితే నేడు సంక్రాంతి కానుకగా వీరి సినిమా నుంచి మరో సరికొత్త పోస్టర్‌ను టీం విడుదల చేసింది. ఇప్పటి వరకు పక్కపక్కను ఉన్న పోస్టర్లు వస్తే ఈ కొత్త పోస్టర్లో మాత్రం ఇద్దరు ఎంతో ప్రేమతో కౌగలించుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా ఓ రొమాంటిక్ డ్రామాగా శేఖర్ కమ్ముల రూపొందించారు. దీనిని శ్రీవెంకటేశ్రరా బ్యానర్‌పై పుస్కూర్ రాంమోహన్, నారాయణ్ దాస్ కే నారంగ్ నిర్మించారు. ఈ సినిమా కోసం అభిమానులు భారీ స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవి తన వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. రానా దగ్గుపాటి సరసన విరాటపర్వం, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్పలో అతడి చెల్లి పాత్రలో నాచురల్ బ్యూటీ కనిపిచంనుంది. ఇక నాగ చైతన్య ముగ్గురు మద్దుగుమ్మలతో థాంక్స్ చెప్పేందుకు సిద్దంగా ఉన్నాడు. నాగ చైతన్యా నూతన చిత్రం థాంక్యూ. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారట. అంతేకాకుండా ఇందులో చైతు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కనిపించనున్నాడట.