తిరుమల శ్రీవారి ను దర్శించుకున్న ప్రముఖ నటుడు మోహన్ బాబు వైసీపీ పాలన పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది అని, అవినీతికి తావు లేకుండా అందరికీ ఒకే విధంగా దర్శన భాగ్యం కల్పించడం సంతోషకరం అంటూ చెప్పుకొచ్చారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే మోహన్ బాబు తో వచ్చిన కూతురు మంచు లక్ష్మి సైతం మీడియా తో మాట్లాడారు. నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం అదృష్టం అంటూ చెప్పుకొచ్చారు. కాగా తాజాగా మంచు లక్ష్మి తన వాట్సాప్ నెంబర్ హ్యాక్ కు గురైందంటూ ట్విట్టర్ ద్వారా తెలిపింది.