విశ్వనటుడు కమల్ హాసన్ తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. వాటిలో పుష్పక విమానం ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా మూకీ కేటగిరీలో విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాని లెజెండ్ సంగీతం శ్రీనివాసరావుగారు దర్శకత్వం చేశారు. ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో మరువలేని మధుర జ్ఞపకంగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే తరహాలో మరో తమిళ నటుడు ప్రయోగం చేయనున్నాడు. అదెవరో కాదండీ తమిళ నాట స్టార్ హీరోగానే కాకుండా విలక్షణ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి. ఈ సినిమాకి గాంధీ టాక్స్ అనే పేరుని ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ను విజయ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. నిశ్శబ్ద యుగాన్ని మరోసారి సెలబ్రేట్ చేద్దాం అనేది దీని ట్యాగ్ లైన్. ఈ సినిమా పోస్టర్ ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పోస్టర్ షేర్ చసిన విజయ్ దీనికి మరో ఆసక్తికర వ్యాక్యాన్ని జోడించాడు. ‘కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దం చాలా బిగ్గరగా ఉంటుంద’ని రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విజయ్ కెరీర్లో ఎంతటి పేరును సంపాదిస్తుందో చూడాలి.