టాలీవుడ్ బెస్ట్ క్యూట్ కపుల్ ఎవరంటే, నాగ చైతన్య, సమంతల పేర్లే తొలుత వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకునే సమంత, తాజాగా, తన భర్త చైతూ ఫొటోపై చేసిన చిలిపి కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 'థ్యాంక్యూ' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతూ.. ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో 'లవ్‌స్టోరీ' షూటింగ్ విరామ సమయంలో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ క్లిక్ మనిపించారు. అందులో చైతన్య చీకట్లో కూర్చొని.. దేని గురించో ఆలోచిస్తున్నట్లుగా ఉంది. దీంతో సమంత 'నా గురించే ఆలోచిస్తున్నావా?' అని ఓ ఫన్నీ కామెంట్ పోస్ట్ చేశారు. దీనిపై చై ఎలాంటి రిప్లై ఇవ్వకపోయినా నెటిజన్లు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లేదు లేదు.. చైకి ఇప్పుడంత తీరిక లేదు. ఆయనిప్పుడు సాయిపల్లవి కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడంటూ.. ఆటపట్టిస్తున్నారు. మరికొందరు మాత్రం తన జెస్సీ గురించే ఆలోచిస్తున్నారంటూ.. పరోక్షంగా సమంతనే గుర్తుచేసుకుంటున్నారని చెబుతున్నారు.