కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒక పక్క వ్యాక్సిన్ వచ్చిన తొలగని భయం. ఇప్పుడైనా పర్వాలేదు. లాక్డౌన్ సమయంలో ఎందరో ప్రజలు అవసరాలకు డబ్బులు లేక, ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయి అనేక అవస్థలు పడ్డారు. అటువంటి కరోనా కష్ట కాలంలో సోనూసూద్ ఎందరికో చేయూతనందించి హీరోగా మారిన సంగతి తెలిసిందే. అత్యంత కఠిన పరిస్థితుల్లో అవసరం ఉన్న వారిని ఆదుకుని ఎన్నో కుటుంబాలకి అండగా నిలిచాడు. పేదలకు, అవసరం ఉన్న వారికి సహాయం చేస్తున్న సోనూసూద్‌ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. ప్రతిరోజు కొత్త కొత్త సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్‌ని ప్రారంభించి ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందకు వస్తున్నాడు. ఇటీవల కొన్న ఫ్యాన్స్‌ను కొనుగోలు చేసిన సోనూ వాటిని అంబులెన్స్‌లుగా మార్చి వాటి ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ఈ సర్వీస్‌ను తీసుకురానున్నాడు. ఈ సర్వీస్‌ను హైదరాబాద్ ట్యంక్ బండ్ ప్రాంతంలో ప్రారంభించాడు. రానున్న రోజుల్లో వీటిని మరింతగా విస్తృతం చేస్తామని తెలిపాడు. అంతేకాకుండా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ సర్వీస్‌లను అందుకోలేని వారికి ఇవి సహాయం చేస్తాయని, వీటి ద్వారా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి చేయూతనిచ్చి రక్షించ గలుగుతామని సోనూ అన్నాడు.