పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాపై ఇంతవరకు ఐతే స్పష్టమైన క్లారిటీ లేదు. ఐతే తాజాగా బాబాయ్, అబ్బాయ్ లు నటించే ఈ సినిమాను సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్, చరణ్‌లతో స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ కథ కూడా శంకర్ గత చాలా ఎమోషనల్ కంటెంట్ బేస్డ్ సినిమాల తరహాలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఎప్పటి నుంచో స్ట్రెయిట్ తెలుగు స్టార్స్ తో శంకర్ సినిమా తీయాలని చాలా కాలం నుంచే అనుకుంటున్నాడట. ఐతే ఈ కథకి పవన్, చరణ్ లాంటి స్టార్స్ కి సరైన కథగా శంకర్ భావిస్తున్నాడని ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్న మాట. చరణ్ మెయిన్ హీరో కాగా, పవన్ ప్రధానమైన రోల్ ఉంటుందని టాక్. చరణ్ అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇంకా ఏ సినిమాను ఫైనల్ చేయలేదట.