మెగా హీరో వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో భారీ హిట్ అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోకి ముకుందా సినిమాతో అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ ఇటీవల తన 10వ సినిమాను ప్రారంబించారు. ఈ చిత్రం బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను నేడు విడుదల చేశారు. ఇందులో వరుణ్ లేజ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. గని పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో పాత్ర కోసం వరుణ్ తేజ్ బాక్సర్ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాడు. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో పంచింగ్ బ్యాగ్‌పై ప్రాక్టీస్ చేస్తూ పవర్ ఫుల్ పంచ్ కొడుతున్నాడు. ఎంతో ఏకాగ్రతగా ప్రాక్టీస్ చేస్తున్న బాక్సర్‌లా వరుణ్ తేజ్ పాత్రలో ఇమిడిపోయాడు. ఇదిలా ఉంటే వరుణ్ ప్రస్తుతం అనిల్ రావిపుడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్3 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా భారీ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్‌గా రూపొందుతోంది. దీనిని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ డబ్బు వల్ల వస్తాయని తెలిపారు. దీంతో పాటుగా వరుణ్ తేజ్ తన బాక్సింగ్ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను కిరన్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా అల్లు బాబి, సిద్దు నిర్మెస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వరుణ్ తేజ్ వారి అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో చూడాలి.