భారత్లో కరనోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్య మళ్ళీ పెరిగింది ... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 13,823 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 162 మంది కరోనా బారినపడి మృతిచెందారు... ఇదే సమయంలో.. 16,988 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో... మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,02,45,741 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.. ఇక, 1,52,718 మంది కరోనాతో కన్నుమూశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,201 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ.