ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభం కానుంది. డోర్ డెలివరీ వాహనాలను రేపు ప్రారంభించనున్నారు సీఎం జగన్. బెంచ్ సర్కిల్ లో ఉదయం 9 గంటలకు జెండా ఊపి వాహనాలను ప్రారంభించనున్నారు సీఎం జగన్. కృష్ణా, గుంటూరు, ప.గో జిల్లాలకు కేటాయించిన 2,503 వాహనాలను లాంచ్ చేయనున్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమైన 9260 మొబైల్ యూనిట్లు... అధునాతన తూకం యంత్రాలు, అనౌన్స్ మెంట్ కిట్, క్యాష్ బాక్స్, ఫ్యాన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి హంగులతో వాహనాలు సిద్ధమయ్యాయి.