మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ సినిమాను నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. డైరెక్టర్ మోహన్ రాజా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటివి చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్‌ని సెలెక్ట్ చేశారు. చిరంజీవి ప్రస్తుతం తన 152 వ సినిమా ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరు నాటికి చిరంజీవి పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. ఫిబ్రవరి నుండి లూసిఫర్ తెలుగు రీమేక్ షూటింగ్లో చిరంజీవి పాల్గొంటాడు.