పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే పవన్ క్రిష్ దర్శకత్వంలోని సినిమాను కూడా ప్రారంభించారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ 20 రోజుల తరువాత పూర్తి కానుంది. ఆ తరువాత పవన్ కాస్త గ్యాప్ తీసుకోని ‘అయ్యపనమ్ కోషియం’ రీమేక్ లో నటిస్తారని తెలుస్తుంది. పవన్ మొదటి నుంచే దర్శకులకు సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చినట్లుగానే షూటింగ్ లకు సమ న్యాయం చేస్తున్నారు. ఈ సినిమాల తరువాత పవన్ తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కథలతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మరో నెల రోజుల తరువాత ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ తన సినిమా కెరీర్ లలో ఎన్నడూ లేనంత బిజీగా 2021 లో ఉన్నాడు.