దర్శకుడు పూరి జగన్నాధ్, మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా 'లోఫర్'తో తెలుగు తెరకు పరిచయమైంది ముంభై భామ దిశా పటాని.. ఆ తరువాత బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన 'రాధే' సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే, దిశా పటానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ రావడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దిశా పటానికి ఫోన్ కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. ఈమెకు మాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్ కు కూడా కాల్ చేసి దిశాను ఎవరూ కాపాడలేరని చెప్పారట.. ప్రస్తుతం ఈ బెదిరింపు కాల్స్ పై దృష్టి పెట్టిన పోలీసులు చాలా సీరియస్ గానే ఎంక్వైరీ చేపట్టారని తెలుస్తుంది. ప్రస్తుతం దిశాకు సెక్యూరిటీని కల్పించారు పోలీసులు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.