జనవరి 22న టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బర్త్ డే.. ఈ సందర్భంగా ఆయన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నటిస్తున్న 'పోలీసు వారి హెచ్చరిక' చిత్ర టైటిల్ను ప్రకటించారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సినిమాలో నటించే మిగితా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత మహేష్ ఎస్ కోనేరు తెలిపారు. కేపీ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య సందర్బంగా మిగితా సినిమాల అయిన 'వరుడు కావలెను', 'లక్ష్య'.. నుంచి కూడా అప్డేట్స్ రానున్నాయి. 2021 లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నాగశౌర్య.