నాగశౌర్య ఊహలు గుసగుసలేడే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూ అలరిస్తుంటాడు. కానీ కొన్ని సినిమాలు చేసిన అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. దాంతో అతడు గేర్ మార్చేశాడు. యాక్షన్ వైపు అడుగులు వేస్తున్న శౌర్యకు చలో సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. దాని మళ్లీ తర్వాత సరైన హిట్ పడలేదు. దేహ దారుఢ్యాన్ని పెంచి యాక్షన్ సీన్స్‌తో సమాజానికి మెసేజ్ ఇచ్చేవిధంగా చేసిన అశ్వథామ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పుడు తాజాగా నాగశౌర్య క్రీడా నేపథ్యంలో తన నూతన సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం టెన్ ప్యాక్ బాడీ ట్రై చేశానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ చాలా సైలెంట్‌గా జరుగుతోంది. అయితే తాజాగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడో కాదండి రేపే. అంటే జనవరి 22న ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కానుందట. ఈ మేరకు లక్ష్య టీం ప్రకటించింది. ఈ టీజర్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇందులో నాగ శౌర్య లుక్స్ చాలా కొత్తగా ఉంటాయని టాక్ నడుస్తోంది. మరి అభిమానులు ఆశించిన విధంగా నాగశౌర్య ఆకట్టుకుంటాడేమో.