అజిత్ పేరుకి తమిళ హీరో అయినా అతడికి అన్న భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అజిత్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతడి మనసు కూడా ఎంతో మంచిది. అజిత్ పుట్టింది సికింద్రాబాద్‌లోనే కానీ పెద్దాయ్యాక సినీ అవకాశాలు కారణంగా తమిళనాడులో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల తన సినిమా షూటింగ్కోసం హైదరాబాద్ వచ్చిన అజిత్ అక్కడ ఓ ఇడ్లీ వ్యాపారికి ఆర్థిక సహాయాన్ని అందించాడు. తన సినిమా రమోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుండటంతో రోజు అక్కడకు అజిత్ వెల్లేవాడు. అయితే తన వాలిమై సినిమా చిత్రీకరణ జరుగుతున్నంత కాలం అక్కడే రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే వ్యాపారి కష్టాన్ని చూశాడు. కొన్ని రోజులు గడిచాక ప్రత్యేకంగా తన అనుచరులతో తెప్పించుకునీ అక్కడి ఇడ్లీని రుచి చూశాడు. అతడి పనితనంతో పాటుగా తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తుండటంతో అతడి గురించి ఆరా తీయించాడు. అతడి జీవనాధారం ఆ ఇడ్లీ వ్యాపారమేనని, అంతేకాకుండా అతడి సంపాదనలో ఎక్కువ శాతం అతని కూతురు చదువుకు ఖర్చవుతుందని తెలిసింది. దాంతో అజిత్ అతడి వ్యాపారం మెరుగుపరుచుకునేందుకు దాదాపు లక్ష రూపాయలు అతనికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాన్ని చెప్పి పెద్ద హంగామా చేయాల్సిన అవసరం లేదని తనలోని స్టార్‌ను మరోసారి చూపించుకున్నాడు.