తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో విజయ్ అభిమానులను అనుకున్న దానికంటే ఎక్కువగా అలరిస్తుంటాడు. ప్రతి సినిమాలో కొత్త తరహా పాత్రతో అందరిని ఆకట్టకుంటాడు. అయితే ఇటీవల విడుదలైన తన మాస్టర్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో పాటుగా తనకు తెలుగులో ఉన్న మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. అయితే విజయ్ దళపతి గత కొంత కాలంగా సీనియర్ దర్శకులను వదిలి యంగ్ దర్శకులకి అవకాశాలు ఇస్తున్నాడు. మాస్టర్ సినిమాతో లోకేష్ కనగరాజ్‌కు అవకాశం అందించాడు. ఇప్పుడు తాజాగా మరో యంగ్ డైరెక్టర్‌కి అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో చేయనున్నాడు. ఇది విజయ్ కెరీర్లో 65వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా అనంతరం విజయ్ మరో యంగ్ డైరెక్టర్ వినోద్‌తో చేయనున్నాడు. అయితే అసలు విషయానికొస్తే వినోద్ విజయ్ కాంబో సర్కార్ సినిమా తర్వాత రావాల్సి ఉంది. కానీ వెంట వెంటనే రెండు పొలిటికల్ డ్రామాలు చేయడం సరికాదని అనుకున్నాడు. దాంతో ఈ సినిమాకు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వినోద్ అజిత్‌తో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత విజయ్‌తో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ దళపతి తన మాస్టర్ సినిమాతో ఎవ్వరూ ఊహించని గుర్తింపు పొందాడు. విదేశాల్లో హాలీవుడ్ సినిమాలను మించిన వసూళ్లను అందుకున్నాడు. ఇండియాలో కూడా మూడు రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి వాటితో ఏ స్థాయిలో రాణిస్తాడో చూడాలి.