చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వైరస్ బారీన పడగా.. లక్షల మంది మృతి చెందారు. ఈ వైరస్‌కు పేద, ధనిక అనే తేడాలు లేవు. ఎవరికైనా సోకుతుంది. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, సిని ప్రముఖులకు ఈ వైరస్ సోకింది. అయితే.. తాజాగా అన్నాడీఎంకే నేత శశికళకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కర్ణాటకలోని పరప్పణ అగ్రహాన జైల్లో అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు...అక్కడ చికత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు కరోనా టెస్టులు చేయగా... ఆ రిపోర్టులో ఆమెకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం శశికళ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. అయితే... ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యారు.