రామ మందిర నిర్మాణ విరాళాల విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. కానీ దీన్ని కొంతమంది వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. నేను కూడా రాముడి భక్తుడినే...నేను కూడా అయోధ్యకు వెళ్తా... దీనిపై రాజకీయం చేయడం తగదు...నేను ఉద్దేశ్య పూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు.. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడి ఉంటే క్షమాపణలు చెప్తున అన్నారు. నా దగ్గరికి ఎవరైనా రామ మందిర నిర్మాణ నిధికి విరాళాలు అడిగినా నేను ఇస్తా... బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని నా సలహా... నాకు మా ముఖ్యమంత్రికి కూడా దైవభక్తి చాలా ఎక్కువ అని విద్యాసాగర్ రావు అన్నారు.