ఎస్ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తో భేటీ కానున్నారు. ఈరోజు ఎస్ఈసీ, సీఎస్సులను రాజ్ భవనుకు రావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు ఎస్ఈసీతో.. 10:30 గంటలకు సీఎస్సుతో భేటీ కానున్నారు గవర్నర్. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇద్దరి వద్ద నుంచి సమాచారాన్ని తీసుకోనున్నారు బిశ్వ భూషణ్ హరి చందన్. ఎన్నికల నిర్వహణ విషయమై చేపట్టే వీడియో కాన్ఫరెన్స్ కంటే ముందుగా ఎస్ఈసీ, సీఎస్సులతో భేటీ కానున్నారు గవర్నర్. దీంతో.. పంచాయతీ ఎన్నికల వేళ... ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అవుతుంది