గత కొన్ని రోజులుగా ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, ఇతర విషయాలతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉన్న ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులపై సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆలయాలపై నిఘా పెరుగుతోంది. ప్రభుత్వ అధికారులతో పాటుగా, దేవస్థానాల సభ్యులు కూడా ఇక ప్రత్యేక సెక్యూరిటీగా మారనున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు ముఖ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.