బాలీవుడ్ స్టార్ కపుల్స్లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ కూడా ఉంటారు. ఈరోజు కరీనా కపూర్ రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సారి కూడా సైఫ్ అలీ ఖాన్ దంపతులకి మగ బిడ్డ పుట్టాడు. ప్రస్తుతం కరీనా ముంబైలోని కాండీ ఆసుపత్రిలో ఉన్నారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ కపుల్ 2016లో తమ మొదటి తనయుడు తైముర్ అలీ ఖాన్కు జన్మనిచ్చారు. మళ్లీ మరో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో చేయనున్నారు. అంతేకాకుండా ఫోన్ భూత్, ధరమ్సాలా చిత్రాల్లలో కనిపించనున్నారు. కరీనా కపూర్ కూడా కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ‘తక్త్’ సినిమాతో పాటు మరో సినిమాలో నటించనున్నారు.