మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెరపై బిజీ అయిపోయాడు. అప్పుడప్పుడూ సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. తాజాగా నాగబాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భుజంపై సింహం టాటూ వేయించుకుని పిచ్చెక్కించే లుక్లో షాక్ ఇచ్చాడు. విలక్షణ పాత్రలు చేసే సత్తా నాగబాబుకు ఉన్నా కూడా మనోళ్లు వినియోగించుకోలేదు.. కానీ ఈయన్ని ఇప్పుడు ఇలా చూసిన తర్వాత న్యూ లుక్ ను వాడుకోకుండా ఉండలేకపోతున్నారు. బలం, బలగం, తెలివిగా ఆలోచించడమే రాజును డిసైడ్ చేయదు.. ఆటిట్యూడ్ అనేది కింగ్ ఎవరో డిసైడ్ చేస్తుంది. అందుకే సింహం అడవికి రాజు అయింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోతో నెటిజన్లు విలన్ పాత్రలోనూ చేయొచ్చా కదా నాగబాబు గారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.