జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుర్తింపును అందుకుంది అనసూయ భరద్వాజ్. అందులో ఆమె చేసిన హోస్టింగ్‌కు.. కనిపించిన తీరుకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. దీంతో ఒక్కసారిగా సెలెబ్రిటీగా మారిపోయిందామె. తద్వారా ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ, ఖిలాడి, పక్కా కమర్షియల్, పుష్ప వంటి చిత్రాలలో స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపించి సందడి చేయనుంది అనసూయ.
ఇక కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ సినిమాలలోనే కాక మరికొన్ని సినిమాలలోను అనసూయ స్పెషల్ సాంగ్స్ చేయనుందనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై స్పందించిన అనసూయ.. ఎలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు. చావు కబురు చల్లగా చిత్రంలోని పాటను నా ఫ్రెండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపాను. వెండితెరపై అద్భుతమైన పాత్రలు చేయాలనేది నాకల అంటూ అనసూయ తెలిపింది.