టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. అతడు ఈ ఏడాది వరుస సినిమాలను ఓకే చేసి మంచి జోరుమీదున్నారు. తాజాగా నితిన్ నటించిన సినిమా చెక్ ఈ నెల 26న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే తాజాగా ఈరోజు ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ను ఇచ్చారు. చెక్ లిరికల్ పాటను రేపు మధ్యహ్నం 2 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నాను’ అంటూ సాగనున్న పాట రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రియా ప్రకాష్ వారియర్, నితిన్ ఇద్దరి మధ్య చోటుచేసుకోనున్నట్లు అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.