అల్లరి నరేష్ తాజాగా హీరోగా నటించిన ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సతీష్ వేగేశ్న నిర్మాత. ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. పలువురు ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించగా, తాజాగా క్రాక్ చిత్ర డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘నాంది’ సినిమా ఇప్పుడే చూశాను. చాలా థ్రిల్లింగ్ ఉంది. అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అద్భుతం. ప్రియదర్శి, హరీష్, దర్శకుడు విజయ్ తన పనిని సక్రమంగా నిర్వర్తించారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అంటూ గోపిచంద్ మలినేని తన ట్వీట్ ద్వారా తెలిపారు.